ఆకట్టుకుంటున్న ప్రియదర్శి - నాగ దుర్గ ‘ఇడుపు కాయితం’

by Pulgam srinivas |

ప్రియదర్శి - నాగ దుర్గ జంటగా నటించనున్న చిత్రానికి ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు.

ఆకట్టుకుంటున్న ప్రియదర్శి - నాగ దుర్గ ‘ఇడుపు కాయితం’
X

దిశ, వెబ్ డెస్క్: సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తికాగా, అదే సందర్భంగా మూవీ యూనిట్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘ఇడుపు కాయితం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే, ఇది పల్లెటూరి నేపథ్యంతో కూడిన ఓ స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. పోస్టర్‌లో హీరో, హీరోయిన్ బైక్‌పై ప్రయాణిస్తూ కనిపించడం, హీరోయిన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం, చుట్టూ ఉన్న సామాన్లు, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే అంశాలు కలిపి ఈ చిత్రంలో మధురమైన భావోద్వేగ ప్రేమకథ ఉండబోతోందనే సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా పోస్టర్‌లో కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఉన్నాయి. వంశీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.




Next Story