- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FIFA World Cup : రోనాల్డో దూకుడు.. పోర్చుగల్ ఘన విజయం
ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్ దశలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని విభాగాల్లోనూ మెరుగైన ఆటతీరును కనబరిచిన పోర్చుగల్ 5-0 తేడాతో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పోర్చుగల్ ఆటగాళ్లు ప్రత్యర్థి రక్షణను ఛేదిస్తూ ఎటాకింగ్ గా ఆడారు. జట్టు తరఫున రోనాల్డో రెండు గోల్స్ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెండెస్, రిబెరో చెరో గోల్ నమోదు చేయగా, మరో గోల్ సెల్ఫ్ గోల్ రూపంలో లభించింది. దీంతో పోర్చుగల్ ఖాతాలో మొత్తం ఐదు గోల్స్ చేరాయి.
ఉజ్బెకిస్థాన్ జట్టు మ్యాచ్ మొత్తం పోర్చుగల్ ను అడ్డుకోవడంలో చాలా కష్ట పడింది. మరోవైపు పోర్చుగల్ డిఫెండింగ్ అద్భుతంగా ఉండటంతో ఉజ్బెకిస్థాన్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. ఈ విజయంతో పోర్చుగల్ జట్టు నాకౌట్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోగా, ప్రత్యర్థి జట్టుపై తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. కాగా, ఈ మ్యాచ్‌లో కనబరిచిన సమిష్టి ప్రదర్శనతో పోర్చుగల్ జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. యువ ఆటగాళ్ల ప్రతిభ, దూకుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.






