CM విజయ్ బర్త్ డే గిఫ్ట్.. ఆడపిల్లలకు బంగారం కానుక

by Muthe.Rajitha |

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ పుట్టినరోజు(జూన్ 22) సందర్భంగా ఆయన ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది.

CM విజయ్ బర్త్ డే గిఫ్ట్.. ఆడపిల్లలకు బంగారం కానుక
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ పుట్టినరోజు(జూన్ 22) సందర్భంగా ఆయన ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. తమిళ సంస్కృతిలో పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు కానుకలు ఇచ్చే సాంప్రదాయం (తాయ్ మామన్ సీర్) ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తానే ఒక మేనమామ స్థానంలో నిలిచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు ‘తాయ్‌మామన్ తంగ మోతిరం’ (Thaaimaaman Thanga Mothiram) అనే పథకాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను మరింత ప్రోత్సహించడం మరియు పుట్టిన బిడ్డలకు ప్రభుత్వ పక్షాన సాదర స్వాగతం పలకడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ప్రతి శిశువుకు గ్రాము బంగారం

ఈ పథకం కింద తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ పథకం కేవలం ఆడపిల్లలకే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టే ప్రతి బిడ్డకూ వర్తిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన కుటుంబాలందరికీ ఈ ఉంగరాలను అందించడానికి తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ.755.83 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.

అన్నాదురై పుట్టినరోజు నుంచి అమలు

ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 22 నుండి పుట్టిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జూన్ 23న అధికారికంగా జీవో కూడా జారీ చేశారు అధికారులు. ప్రారంభ సూచికగా తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ రోజు పుట్టిన ఆరుగురు బిడ్డలకు బంగారు ఉంగరాలను అందజేశారు. జూన్ 22 నుండి పుట్టిన పిల్లలందరూ దీనికి అర్హులైనప్పటికీ, ఈ పథకాన్ని అధికారికంగా డీఎంకే వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై జయంతి సందర్భంగా రాబోయే సెప్టెంబర్ 15న ఘనంగా ప్రారంభించి, ఆ తర్వాత అర్హులైన పిల్లలందరికీ ఈ ఉంగరాలను విస్తృతంగా పంపిణీ చేయనున్నారు.

Next Story