త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-05-15 04:58:21  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశామని, త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ముందస్తు షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అటు జూన్ 1 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరుకావాలని మంత్రి సురేష్ సూచించారు. కాగా, ఇటీవల కరోనా ప్రభావం క్రమంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను [&hellip;]</p>

Tenth students all pass
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశామని, త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ముందస్తు షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

పలు రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అటు జూన్ 1 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరుకావాలని మంత్రి సురేష్ సూచించారు. కాగా, ఇటీవల కరోనా ప్రభావం క్రమంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Next Story