గ్రేటర్​ గులాబీ ఇంఛార్జీల్లో ఆందోళన

by  |
గ్రేటర్​ గులాబీ ఇంఛార్జీల్లో ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి డివిజన్లకు బాధ్యత వహించిన ఇంఛార్జీల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల ప్రచారం అన్ని డివిజన్లకు టీఆర్​ఎస్​ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులందరినీ ఇంఛార్జీలుగా నియమించింది. డివిజన్లలో ప్రచారం నుంచి పంపకాల వరకు బాధ్యతలన్నీ వీరిపైనే వేసింది. దీంతో రాష్ట్రంలో ఆయా ప్రాంతాల నుంచి ఇంఛార్జీలుగా ఉన్న వారి అనుచరులు గ్రేటర్​లో మకాం వేశారు.

ప్రస్తుతం గ్రేటర్​ ఓట్ల లెక్కింపు సాగుతున్న సమయంలో వారందరిలోనూ ఆందోళన, ఉద్వేగభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల ఇంఛార్జీలు సరిగా పని చేయలేదని, పార్టీ ఫండ్​ సరిగా పంపిణీ చేయలేదనే ఆరోపణలున్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు ఊగిసలాటకు గురి చేస్తున్నాయి. గెలుపు భరోసా ఉన్న డివిజన్లలో ఇంఛార్జీలు కొంత సంబురంతో ఉన్నా… వెనకంజలో ఉన్న ప్రాంతాల బాధ్యులు మాత్రం తడబడుతున్నారు. అధిష్టానంపై తమ నమ్మకం ఎలా ఉంటుందనే ఆందోళన మొదలైంది. ఒకవేళ ఓడిపోతే తమపైనే నిందలు వేస్తారనే భయంతో ఉన్నారు. దీంతో గ్రేటర్​ ఫలితాలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికార పార్టీ నుంచి బాధ్యత వహించిన వారంతా హైదరాబాద్​కు చేరుకున్నారు. వారు బాధ్యతలు తీసుకున్న ప్రాంతాల ఓటింగ్​ సరళి, ఫలితాలను చూస్తూ అంచనా వేసుకుంటున్నారు.



Next Story