బ్రేకింగ్.. ఇంటర్ బోర్డు వద్ద టెన్షన్.. టెన్షన్

by  |
బ్రేకింగ్.. ఇంటర్ బోర్డు వద్ద టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ ఫలితాలు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రిజల్ట్స్ అనంతరం విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న కారణంగా విద్యార్థి సంఘాల నేతలు తెలంగాణ సర్కార్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇంటర్ బోర్డు ఎదుట ఏబీవీపీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బోర్డు కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేశాడు.

కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పందించని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ తో నినాదాలు చేశారు. నిరసనల్లో భాగంగా పోలీసులు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకుడు స్పృహ తప్పి పడిపోయాడు.

Next Story

Most Viewed