టీడీపీ, వైసీపీ మధ్య రచ్చ.. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లి..

93

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ మొదటి సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ-వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-వైసీపీ సభ్యులు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లి పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో స్పల్ప తోపులాట చోటుచేసుకుంది.

సమావేశంలో 30 వార్డుల సమస్యలపై చర్చించకుండా.. కేవలం రెండు వార్డుల సమస్యలను మాత్రమే చర్చిస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపణలకు దిగారు. దీనికి వైసీపీ సభ్యులు ప్రతిదాడి చేయడంతో సమావేశం రచ్చకు దారితీసింది. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..