- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి ఎదుట మృతదేహాంతో ధర్నా నిర్వహించారు. ఆదివారం రాత్రి చాగలమర్రి మండలంలోని ఒక తాండకు చెందిన తొమ్మిది సంవత్సరాల బాలికకు తేలు కొట్టడంతో చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం బాలిక మృతి చెందింది. కాగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని ఆరోపిస్తూ… బాలిక తల్లిదండ్రులు మృతదేహంతో రోడ్డుపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి ఎదుట మృతదేహాంతో ధర్నా నిర్వహించారు. ఆదివారం రాత్రి చాగలమర్రి మండలంలోని ఒక తాండకు చెందిన తొమ్మిది సంవత్సరాల బాలికకు తేలు కొట్టడంతో చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
సోమవారం ఉదయం బాలిక మృతి చెందింది. కాగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని ఆరోపిస్తూ… బాలిక తల్లిదండ్రులు మృతదేహంతో రోడ్డుపై ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వైద్యం కోసం వస్తే డాక్టర్లు పట్టించుకోలేదని, నూరేళ్లు బ్రతకాల్సిన మా బిడ్డ అఖిల భాయ్ 9 సంవత్సరాలకే తనువు చాలించింది అంటూ బాధితులు రోదిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలతో కలసి, పాప మృతదేహంతో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు.
Next Story






