2020లో టెన్నిస్ ఆడను : ఫెదరర్

by  |
2020లో టెన్నిస్ ఆడను : ఫెదరర్
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అభిమానులకు షాకిచ్చాడు. ఈ ఏడాది టెన్నిస్ ఆడనని, తిరిగి 2021 నుంచే కొత్త సీజన్ ప్రారంభిస్తానంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపాడు. వరుసగా టెన్నిస్ ఆడుతున్న ఫెదరర్‌కు ఇటీవల మోకాలికి గాయమైంది. దీంతో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వైద్యుల సూచనల మేరకు 6 నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలిపాడు. ఫిబ్రవరిలోనే ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. నాలుగు నెలల విశ్రాంతి అనంతరం టెన్నిస్ ఆడదామని భావించాడు. కానీ, గాయం పూర్తిగా మానకపోవడం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాదంతా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Next Story

Most Viewed