కొత్త పట్టాదారు పాసు పుస్తకాలకు టెండర్లు ఆహ్వానం

470
Pattadaru pass books

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కొత్త రైతు పట్టాదారు పాసు పుస్తకాల కోసం టెండర్లను ఆహ్వానించింది. అందులో 17 ఫీచర్లు ఉంటాయి. ప్రతి నెలా 60 వేలు(25 శాతం ఎక్కువ, తక్కువ) ముద్రించాల్సి ఉంటుంది. రెండేండ్ల పాటు ముద్రించి హైదరాబాద్ కు సరఫరా చేసే సంస్థల నుంచి టెండర్లు కోరుతూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఓపెన్ ఎక్స్ప్రెస్ టెండర్ నోటీసును విడుదల చేసింది. బిడ్ డాక్యుమెంట్ ఫీజును రూ.10 వేలుగా నిర్ణయించింది. ఈఎండీ రూ.25 లక్షలుగా పేర్కొంది. ఈ నెల 27వ తేదీ లోగా బిడ్స్ సమర్పించేందుకు ఆఖరు తేదీగా ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..