- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నన్ను వాళ్లు పొల్లు పొల్లు కొట్టారు సార్'.. పీఎస్ లో ఫిర్యాదు చేసిన మైనర్
<p>దిశ, వెబ్ డెస్క్: కందిపప్పును దొంగతనం చేశానంటూ ఆరోపణ చేస్తూ తనపై పదిమంది దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఓ మైనర్ బాలుడు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని గుట్టిఘర్ లో గత నెల 27వ తేదీన ఓ మైనర్ బాలుడిపై పది మంది కలిసి దాడి చేశారు. కందిపప్పు దొంగతనం చేశావంటూ ఆ బాలుడిని ఇష్టానుసారంగా తిడుతూ దాడి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కందిపప్పును దొంగతనం చేశానంటూ ఆరోపణ చేస్తూ తనపై పదిమంది దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఓ మైనర్ బాలుడు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని గుట్టిఘర్ లో గత నెల 27వ తేదీన ఓ మైనర్ బాలుడిపై పది మంది కలిసి దాడి చేశారు. కందిపప్పు దొంగతనం చేశావంటూ ఆ బాలుడిని ఇష్టానుసారంగా తిడుతూ దాడి చేశారు. ఆ కందిపప్పు దొంగతనం చేసింది కాదని.. తన తల్లిదండ్రులు పండించిన కందిపప్పును తీసుకెళ్తున్నానని చెప్పినా వినకుండా ఆ బాలుడిపై తీవ్రంగా దాడి చేశారు. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈనెల 2న ఆ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story






