బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహల్స్ పెద్దమ్మ దేవాలయాలు మూసివేత…

77

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంలో ఇప్పటికే చాలావరకు ఆలాయాల్లో ఆంక్షలు విధించిన విషయం తెలిసింది. భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మల ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయంలో సాధరణ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలను, అలాగే అన్ని సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నేటి నుండి 14వ తేదివరకు అన్ని దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అమ్మవార్లకు ఏకాంత సేవలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..