- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే ఘన విజయం
టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే.. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో జింబాబ్వే చారిత్రాత్మక విజయం సాధించింది. బ్రియాన్ బెన్నెట్ (64*) బ్యాటింగ్‌లో మెరవగా, బౌలింగ్‌లో ముజారాబాని (4 వికెట్లు) ఆసీస్ పతనాన్ని శాసించాడు. 19 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ వేదికపై ఆసీస్‌ను మట్టికరిపించి జింబాబ్వే చరిత్ర సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పసికూన జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగుల భారీ స్కోరు సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ 56 బంతుల్లో 64 పరుగులు (నాటౌట్) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, చివర్లో కెప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.
అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా బ్లెస్సింగ్ ముజారాబాని 4 వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరవగా, బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి ఆలౌట్ అయింది. ఆసీస్ స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం ఆ జట్టు కొంపముంచింది. అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన ముజారాబాని 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకున్నాడు.
ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఐసీసీ ప్రపంచకప్ వేదికపై ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడం దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా 2007 టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే ఆసీస్‌పై జింబాబ్వే గెలిచింది. ఈ పరాజయంతో ఆస్ట్రేలియా సూపర్-8 అవకాశాలు క్లిష్టతరం కాగా, జింబాబ్వే జట్టు ఆశలు సజీవంగా ఉన్నాయి.






