చీమల పెద్దక్కను కలిసిన YS షర్మిల

by Gantepaka Srikanth |

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వేదికగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

చీమల పెద్దక్కను కలిసిన YS షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వేదికగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏపీ వేదికగానే కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయదల్చింది. ఇందులో భాగంగానే సోమవారం ఈ పథకం ప్రారంభించిన గ్రామంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘ఎంజీ నరేగా(MGNREGA) పథకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టానికి నేటితో 20 ఏళ్లు నిండిన సందర్భంగా.. ఆనాడు 2005లో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం వద్ద పథకం ప్రారంభించినప్పుడు గుర్తుగా వేసిన శిలాఫలకాన్ని సందర్శించి ఇదే బండ్లపల్లి గ్రామం నుంచి ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగింది. దేశంలోనే తొలి జాబ్ కార్డు అందుకున్న బండ్లపల్లి గ్రామస్థురాలు చీమల పెద్దక్కను కలిసి ఉపాధి హామీ పథకం తీరుతెన్నులను అడిగి తెలుసు కోవడం జరిగింది’ అని షర్మిల పేర్కొన్నారు.

Next Story