సోషల్ మీడియాలో నగల ప్రదర్శన.. యూట్యూబర్ కు ఊహించని షాక్ ఇచ్చిన దొంగలు

by Malleboina Mahesh |

వ్యక్తిగత విషయాలు, విలువైన వస్తువులను సోషల్ మీడియాలో అతిగా ప్రదర్శించడం ఎంతటి ప్రమాదకరమో హెచ్చరించే ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ యూట్యూబర్ ఇంట్లో చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో నగల ప్రదర్శన.. యూట్యూబర్ కు ఊహించని షాక్ ఇచ్చిన దొంగలు
X

దిశ, వెబ్ డెస్క్: తనకున్న నగలు చూపిస్తూ వీడియోలను తీసిన.. ఫేమస్ అయిన యూట్యూబర్ (YouTuber)కు దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే దొంగలు పడి.. ఆమో సోషల్ మీడియో పెట్టిన మొత్తం నగలను ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ యూట్యూబర్ రచనా గుర్జర్ (rachanaa gurjar) తన యూట్యూబ్ లైవ్, సోషల్ మీడియా అకౌంట్లలో తనకున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన వీడియోలను ఇటీవల షేర్ చేశారు. అయితే, ఈ ప్రదర్శనే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఈ వీడియోలను గమనించిన దొంగలు, ఆమె నివాసమే లక్ష్యంగా స్కెచ్ వేశారు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి చొరబడిన దుండగులు.. లాకర్లను పగులగొట్టి రూ. 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 1.91 లక్షల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఇంట్లోని ఎనర్జీ డ్రింక్స్ (రెడ్‌బుల్ వంటివి) కూడా ఎత్తుకెళ్లడం గమనార్హం.

ఈ భారీ చోరీపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన తీరును బట్టి, సోషల్ మీడియాలో ఆమె పెట్టిన నగల వీడియోల ఆధారంగానే దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో, ప్రజలెవరూ తమ ఇళ్లలోని నగదు, నగలు, కొత్తగా కొనుగోలు చేసిన ఖరీదైన వస్తువులను సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించవద్దని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇటువంటి హంగులు, ప్రదర్శనలు కేవలం సైబర్ నేరగాళ్లనే కాకుండా, స్థానిక దొంగలను కూడా సులభంగా ఆకర్షించి ఇలాంటి అనర్థాలకు దారితీస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

Next Story