ఇండియన్ ఎకానమీలో యూట్యూబర్ల హవా... కోట్లలో కంట్రిబ్యూషన్

by Disha Web |
ఇండియన్ ఎకానమీలో యూట్యూబర్ల హవా... కోట్లలో కంట్రిబ్యూషన్
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'యూట్యూబ్' హవా కొనసాగుతోంది. యంగ్ జనరేషన్ యూట్యూబ్ వేదికగా తమ క్రియేటివిటీతో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ క్రియేటర్ ఎకోసిస్టమ్ 2020లో భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 6800 కోట్లు కంట్రిబ్యూట్ చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదించింది. ఇది భారతదేశంలో యూట్యూబ్‌‌కు సంబంధించిన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రభావాన్ని విశ్లేషించే ఇండిపెండెంట్ కన్సల్టింగ్ సంస్థ.

ఈ రిపోర్ట్ ప్రకారం, యూట్యూబ్ క్రియేటర్ ఎకో‌సిస్టమ్.. 2020లో ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానంగా 6,83,900 మందికి ఉపాధి కల్పించింది. స్పాన్సర్‌షిప్స్, ఫ్యాన్ మీట్‌అప్స్ రూపంలో వచ్చే ప్లాట్‌ఫామ్ రెవెన్యూస్, సబ్‌స్క్రిప్షన్స్ వంటి నాన్ అడ్వర్టైజింగ్ రాబడులు సహా యాడ్ రెవెన్యూస్ కూడా ఇందులో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. కాగా ప్రత్యక్ష ప్రభావం(క్రియేటర్స్, వారి టీమ్ ఆర్జించే లాభం, జీతాలు), పరోక్ష ప్రభావం(యూట్యూబ్ ప్రభావంతో ఇండియన్ సప్లయ్ చైన్‌లో ఖర్చు చేయడం), అలాగే ప్రేరేపిత ప్రభావం(క్రియేటర్ ఎకోసిస్టమ్ నియమించుకున్న ఉద్యోగుల వేతన వ్యయం) ఆధారంగా ఈ అధ్యయనం YouTube ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేసింది.

ఇదిలా ఉంటే, ఈ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చే ఆదాయమే కాక క్రియేటర్స్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందవచ్చు. అంతేకాదు బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్స్, లైవ్ పర్ఫార్మెన్సెస్ తదితర పద్ధతుల్లో బహుళ ఆదాయ మార్గాలను అన్వేషించడంలోనూ సాయపడుతుందని యూట్యూబ్ పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనతో పాటు కల్చర్ ఇన్‌ఫ్లూయెన్స్‌ను సైతం ప్రభావితం చేయగల సాఫ్ట్-పవర్‌గా ఉద్భవించే సామర్థ్యం దేశంలోని క్రియేటర్ ఎకానమీకి ఉందని యూట్యూబ్ పార్ట్‌నర్‌షిప్స్ రీజినల్ డైరెక్టర్(ఏసియా-పసిఫిక్) అజయ్ విద్యాసాగర్ తెలపడం విశేషం.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed