- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికసిత్ భారత్ సాధనలో యువత ముందుండాలి : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఏపీలోని విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆమె మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఉన్నత విద్యను పూర్తి చేసుకుని సమాజంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తుకు మార్గదర్శనం చేశారు. అలాగే అత్యుత్తమ అకడమిక్ రికార్డును కనబరిచిన 13 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ బహూకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే 'వికసిత్ భారత్'(Viksit Bharat) మహా సంకల్ప సాధనలో దేశ యువత అత్యంత కీలకమైన పాత్ర పోషించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. యువతరం తమ ఆలోచనలతో, నైపుణ్యాలతో దేశ పురోగతికి బాటలు వేయాలన్నారు.
యువతకు అందించే నాణ్యమైన విద్య అనేది కేవలం చదువు మాత్రమే కాదని, అది వారి జీవితాలను మార్చే ఒక గొప్ప సాధికారత ఆయుధమని ఆమె స్పష్టం చేశారు. మన దేశానికి మూలస్తంభాల లాంటి గిరిజన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అదే సమయంలో, మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పూర్తిగా అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.






