- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.

దిశ, ఎల్కతుర్తి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని సూరారం గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరికి కూడా అన్యాయం జరగకుండా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. అనంతరం జగన్నాధపూర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, గోలీ రాజేశ్వరరావు, డాక్టర్ రమేష్ బాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుల్లూరి శ్రీధర్ రావు, శనిగరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






