- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దువ్వాడ మిస్సింగ్‌పై వీడిన సస్పెన్స్.. ఆ ప్రాంతంలో చూపిస్తున్న లొకేషన్
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ పై సస్పెన్స్ వీడింది. ఆయన ఒడిశాలోని ఒరంపురం వైపు వెళుతున్నట్టు సిగ్నల్స్ చూపిస్తున్నాయని సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం బాగోలేదని, మూడు వారాల సమయం కావాలని దువ్వాడ తరఫున లాయర్ పోలీసులను కోరినట్టు తెలుస్తోంది.

దిశ, వెడ్ డెస్క్: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ పై సస్పెన్స్ వీడింది. ఆయన ఒడిశాలోని ఒరంపురం వైపు వెళుతున్నట్టు సిగ్నల్స్ చూపిస్తున్నాయని సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం బాగోలేదని, మూడు వారాల సమయం కావాలని దువ్వాడ తరఫున లాయర్ పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ కనిపించడంలేదంటూ దివ్వెల మాధురి ఆందోళన చేపట్టడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్ వెళుతుంటే మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయారని దివ్వెల ఆరోపించారు.
ఆయనను పోలీసులే అరెస్ట్ చేశారని ఆందోళన చేశారు. వెంటనే దువ్వాడ సమాచారం ఇవ్వాలంటూ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్ కు బయలుదేరి గంటల సమయం గడుస్తున్నా ఆచూకీ తెలియలేదని, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు. కారు డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. కొత్తూరు పోలీసులు మాత్రం దివ్వెల మాధురి ఆరోపణలను ఖండించారు. ఆయన పోలీస్ స్టేషన్ కు రాలేదని చెప్పారు. హైడ్రామా నేపథ్యంలో పోలీసులు దువ్వాడ లొకేషన్ ట్రేస్ చేయగా ఒడిశాలో ఉన్నట్టు తెలిసింది. అయితే ఆయన ఎందుకు ఒడిశా వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది.






