ఏడుపాయల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి

by Batti.Sumithra |

ప్రఖ్యాతి గాంచిన ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం అభివృద్ధికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పాపన్నపేట మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్నారు.

ఏడుపాయల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి
X

దిశ, పాపన్నపేట : ప్రఖ్యాతి గాంచిన ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం అభివృద్ధికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పాపన్నపేట మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఏడుపాయల దేవస్థానం ప్రాంగణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏడుపాయల పర్యాటక అభివృద్ధిలో భాగంగా కాటేజీల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్లు విడుదల చేయడం హర్షణీయం అన్నారు.

టూరిజం శాఖ టిజిటిడిసి ద్వారా మంజూరు నిధులు మంజూరు అయ్యాయని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రోహిత్ రావు ఆధ్వర్యంలో ఏడుపాయల మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షులు గోవింద్ నాయక్, మాజీ జెడ్పిటిసి మల్లప్ప, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్ గుప్తా, ఏడుపాయల మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Next Story