- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో రాష్ట్రపతి కాన్వాయ్ దగ్గర హైటెన్షన్
by Ajay Maddhiboyina |
ఏపీలోని విశాఖలో నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని విశాఖలో నేడు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఓ యువకుడు హల్ చల్ చేశాడు. రాష్ట్రపతికి కలిసేందుకు నోవొటల్ గేట్ వద్ద కాన్వాయ్ పైకి ఓ యువకుడు దూసుకువచ్చాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, రాష్ట్రపతి కాన్వాయ్ కు ట్రాఫిక్ క్లియర్ చేశారు. యువకుడి అకస్తాత్తుగా రావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ద్రౌపది ముర్ము బెంగళూరుకు పయనం అయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ తో పాటు అధికారులు ఆమెకు వీడ్కోలు పలికారు.
Next Story






