ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద

by Ratna Kumari |

జిల్లా కలెక్టర్ డా.సత్య శారద మంగళవారం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద
X

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లా కలెక్టర్ డా.సత్య శారద మంగళవారం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ధర్మరాజ్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనసూర్య, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story