- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఎల్‌వోల పనితీరు భేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎలక్షన్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

దిశ, దమ్మపేట:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎలక్షన్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామంలోని 106వ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ, సర్ ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. దమ్మపేట మండలంలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న బూత్ స్థాయి అధికారులు అత్యంత ప్రతిభావంతంగా, అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఉత్సాహంతో నిర్దేశిత గడువులోగా ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట తహసీల్దార్, మండల గిర్దావర్ భిక్షమయ్య, ఎలక్షన్ సూపర్‌వైజర్లు రెడ్డి నరసింహరావు, షేక్ జలీల్ పాషా, పంచాయతీ కార్యదర్శి పూనెం రామకృష్ణ, స్థానిక గ్రామ పెద్దలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






