ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్.. యువకుడి పరిస్థితి విషమం

by Jakkula.Mamatha |

మంత్రుల పర్యటన నేపథ్యంలో మణుగూరు మండలం తొగ్గూడెం సమ్మక్క–సారలమ్మ ఆలయం సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ఈ బయ్యారానికి చెందిన బాలాజీ ఫ్లెక్సీ షాప్ నిర్వాహకుడు సిరిగడ్డే సంతోష్ విద్యుత్ షాక్‌కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్.. యువకుడి పరిస్థితి విషమం
X

దిశ, మణుగూరు: మంత్రుల పర్యటన నేపథ్యంలో మణుగూరు మండలం తొగ్గూడెం సమ్మక్క–సారలమ్మ ఆలయం సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ఈ బయ్యారానికి చెందిన బాలాజీ ఫ్లెక్సీ షాప్ నిర్వాహకుడు సిరిగడ్డే సంతోష్ విద్యుత్ షాక్‌కు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంలోని నాగరాజు ఆస్పత్రికి తరలించగా, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే ఆయన తండ్రి కృష్ణమూర్తి మృతి చెందగా, ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ కు గురైన బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా గురువారం తెల్లవారుజామున ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై డాక్టర్ నాగరాజు హాస్పిటల్ లో వైద్యం చేసుకుంటుంటే కనీసం కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం దుర్మార్గం అన్నారు. కనీసం పరామర్శింలేదని ఇంతకంటే దారుణం ఉంటదా అని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని , వెంటనే రూ.20 లక్షలు ఇచ్చి వైద్యం చేయించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story