- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరికొత్త క్యాంపెయిన్ స్టార్ట్.. సమంత, రకుల్‌కు సవాల్ విసిరిన కాజల్!
ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ సరికొత్తగా ట్రెండ్‌ను సృష్టించారు. ‘#WhatsOnYourPlate’ అవగాహన ప్రచారంలో కాజల్‌తో పాటు శ్రేయాస్ భాగమయ్యారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఇండియన్ స్టోరీ’. చేతన్ డీకే దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని పురుగుమందుల వాడకం, ఆహార కల్తీ, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ , ఎమ్ఐజి ప్రొడక్షన్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సాగర్ బి. షిండే ఈ చిత్రానికి కథ, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 24న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ సరికొత్తగా ట్రెండ్‌ను సృష్టించారు. ‘#WhatsOnYourPlate’ అవగాహన ప్రచారంలో కాజల్‌తో పాటు శ్రేయాస్ భాగమయ్యారు. మనం రోజువారీగా తీసుకునే ఆహారంలో పురుగుమందుల వాడకం, ఆహార కాలుష్యం (కల్తీ) గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం.
నటి కాజల్ అగర్వాల్ తన రాత్రి భోజనం ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా? అనే ఒక ఆలోచింపజేసేలా ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారం పట్ల మరింత శ్రద్ధ వహించాలని కోరింది. అంతేకాకుండా, ఈ సామాజిక అవగాహనను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత రూత్ ప్రభులను కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా కాజల్ సవాల్ విసిరింది. మరోవైపు నటుడు శ్రేయస్ తల్పాడే కూడా కాజల్ అభిప్రాయాన్ని బలపరుస్తూ పోస్ట్ చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతమైన వినియోగదారులుగా మారాలని, మనం ప్లేట్లలో పెట్టుకుని తినే ఆహారం వెనుక ఉన్న అసలు నిజాలు, నివేదించబడని సమస్యలపై చర్చ జరగాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ ఛాలెంజ్ ద్వారా ప్రజలు తాము ప్రతిరోజూ తినే ఆహారం గురించి తెలుసుకుని, సరైన నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కాజల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






