- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను బ్రతికిస్తున్న అభిమానుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను: శ్రీలీల
తనకు అభిమానులను నేరుగా కలుసుకోవడం ఎంతో ఇష్టమని, వారి చూపే ప్రేమ, ఉత్సాహం తనకు కొత్త ఎనర్జీని ఇస్తాయని చెప్పుకొచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు అదృష్టం కలిసిరావడం లేదు. తన టాలెంట్ చూపించినప్పటికీ నిరాశనే ఎదురవుతోంది. ఆమె ఇటీవల నటించిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్', 'పరాశక్తి' వంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ భామపై విమర్శలు వస్తున్నాయి. ఈ వరుస ఫ్లాపుల వల్ల ఆమెను కొన్ని సినిమాల నుండి తొలగిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. దీనికి తోడు నెట్టింట ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన అభిమానుల కోసం తాను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
తనకు అభిమానులను నేరుగా కలుసుకోవడం ఎంతో ఇష్టమని, వారి చూపే ప్రేమ, ఉత్సాహం తనకు కొత్త ఎనర్జీని ఇస్తాయని చెప్పుకొచ్చింది. తనలాంటి కళాకారులను ఎల్లప్పుడూ బ్రతికించేది ప్రేక్షకులేనని, అందుకే వారిని అలరించేందుకు భవిష్యత్తులో మరింత శ్రమించి మంచి సినిమాలను అందిస్తూనే ఉంటానని శ్రీలీల తన పేర్కొన్నారు. ఒకపక్క తెలుగులో ఎదురుదెబ్బలు తగులుతున్నా.. ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె తమిళ, హిందీ భాషల్లోని స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ధనుష్ సరసన ‘D-55’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతూ.. క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన మోస్ట్ అవేటెడ్ లవ్ సాగా ‘ఆషికి-3’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.






