మానవత్వం చాటుకున్న జగిత్యాల పోలీసులు

by Kodari Anjali |

జగిత్యాల పట్టణ పోలీసులు తమ మానవీయ కోణాన్ని చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మానవత్వం చాటుకున్న జగిత్యాల పోలీసులు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణ పోలీసులు తమ మానవీయ కోణాన్ని చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో వీధుల్లో నిరాశ్రయులుగా, మతిస్థిమితం కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్న 14 మంది వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసిన వారందరికీ ముందుగా హెయిర్ కటింగ్ చేయించి, స్నానం చేయించి, కొత్త దుస్తులు అందించారు. అనంతరం వారికి ఆహారం అందించి, ఆత్మగౌరవంతో జీవించేలా తొలి అడుగు వేశారు. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలను కాపాడటమే కాదు.. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన నిరాశ్రయులకు అండగా నిలిచి, వారికి కొత్త జీవితంపై ఆశ కల్పించిన జగిత్యాల పట్టణ పోలీసుల మానవీయ చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సేవాభావానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story