జీవో నెంబర్-6 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి..

by Kodari Anjali |

పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్-6 ప్రకారం నూతన కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి పి. గణేష్ డిమాండ్ చేశారు.

జీవో నెంబర్-6 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి..
X

దిశ, నాచారం: పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్-6 ప్రకారం నూతన కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి పి. గణేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు బాచుపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలో నిర్వహించనున్న ‘చలో బాచుపల్లి’ భారీ బహిరంగ సభ పోస్టర్‌ను నాచారంలో సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పి. గణేష్ మాట్లాడుతూ.. కార్మికుల శ్రమకు తగిన గౌరవం కల్పిస్తూ ప్రభుత్వం, యాజమాన్యాలు జీవో నెంబర్-6 ప్రకారం నూతన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు హెల్పర్లకు రూ.16,000, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,000, స్కిల్డ్ కార్మికులకు రూ.18,500, హై స్కిల్డ్ కార్మికులకు రూ.20,000 కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. రమేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. బాచుపల్లి ఇండస్ట్రియల్ ప్రాంతంలోని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈ. రమేష్, స్వామి గౌడ్, అరవింద్, కిషోర్, సూరజ్, సౌరబ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story