ఎన్బీడబ్ల్యూ వారెంట్ అమలు.. నిందితుడు అరెస్ట్, జైలుకు తరలింపు

by Kodari Anjali |

ఇతర పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నవ్యక్తి కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు చేసింది.

ఎన్బీడబ్ల్యూ వారెంట్ అమలు.. నిందితుడు అరెస్ట్, జైలుకు తరలింపు
X

దిశ, శాయంపేట: శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎడ్లు దొంగతనం కేసుతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పరకాల పట్టణానికి చెందిన మోరె సాయి కుమార్ (20) కోర్టుకు హాజరు కాకపోవడంతో పరకాల న్యాయస్థానం ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు శాయంపేట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పరకాల న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు. ఈ విషయాన్ని శాయంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై జక్కుల పరమేశ్వర్ వెల్లడించారు.

Next Story