- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి
హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం ఆరు పతకాలు సాధించారు.

దిశ, కామారెడ్డి రూరల్ : హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం ఆరు పతకాలు సాధించారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో సమర్థతతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శప్రాయమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇవే విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
జిల్లా పోలీసు శాఖలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, సిబ్బంది విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ పోలీసు శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏఆర్ డీఎస్పీ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి వివిధ క్రీడల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిలో ఐదుగురు మొత్తం ఆరు పతకాలు సాధించారు.
పతక విజేతలు :
ఎన్. ఉత్తేజ్ (పీసీ), కామారెడ్డి పోలీస్ స్టేషన్ – వుషూ (80 కేజీలు)లో స్వర్ణ పతకం, బాక్సింగ్ (80 కేజీలు)లో రజత పతకం.
పి.బాలరాజు (పీసీ), నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ – రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్–97 కేజీలు)లో రజత పతకం.
జె.అంకోష్ (పీసీ), డీఏఆర్, కామారెడ్డి– రెజ్లింగ్ (గ్రెకో రోమన్–87 కేజీలు)లో కాంస్య పతకం.
ఎన్.ప్రభు (పీసీ), డీఏఆర్, కామారెడ్డి – రెజ్లింగ్ (గ్రెకో రోమన్–97 కేజీలు)లో కాంస్య పతకం.
చి.వినయ్ రెడ్డి (పీసీ), ఎస్‌ఎస్ నగర్ పోలీస్ స్టేషన్–కరాటే (60 కేజీలు)లో కాంస్య పతకం.
భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించి కామారెడ్డి జిల్లా, తెలంగాణ పోలీసు శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఎస్పీ రాజేష్ చంద్ర ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, పతక విజేతలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






