బండి సంజయ్ ముస్తాబాద్ పర్యటన..

by Kodari Anjali |

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పర్యటించారు.

బండి సంజయ్ ముస్తాబాద్ పర్యటన..
X

దిశ, ముస్తాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా అవునూర్, గూడెం, కొండాపూర్, మొరాయిపల్లి గ్రామాలకు వెళ్లి ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, కష్టకాలంలో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్, సర్పంచ్ నక్క దాసరి రవి, ఉపసర్పంచ్ మహేష్, సత్యం రెడ్డి, నక్కల భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story