రాజకీయాలను నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: మాజీ మంత్రి కాకాణి

by Vemula.Srinu Prasad |

కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్‌పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయంపై లోకేష్‌కు కనీస అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు తాను చూపించే ఏవైనా ఐదు వ్యవసాయ మొక్కల పేర్లను ఆయన సరిగ్గా చెబితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కాకాణి సవాల్ విసిరారు..

రాజకీయాలను నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: మాజీ మంత్రి కాకాణి
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్‌పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయంపై లోకేష్‌కు కనీస అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు తాను చూపించే ఏవైనా ఐదు వ్యవసాయ మొక్కల పేర్లను ఆయన సరిగ్గా చెబితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కాకాణి సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం దోపిడీయే పరమావధిగా పాలిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఆదాయ వనరులను సమకూర్చితే, ప్రస్తుతం సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని కాకాణి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిర్మించిన రామాయపట్నం పోర్టును ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమే ఇందుకు నిదర్శనమని కాకాణి విమర్శించారు.

ఈ ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వకాల నుంచి నిరుద్యోగుల డీఎస్సీ నోటిఫికేషన్ వరకు ప్రతి ఒక్క విషయంలోనూ అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ప్రతి పథకంలోనూ, ప్రభుత్వ నిర్ణయంలోనూ పారదర్శకత లోపించిందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లోతగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story