Rambha: ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్స్‌లో ఆ ఇద్దరంటే చాలా ఇష్టం

by Pulgam srinivas |   (  Updated:2026-07-17 10:18:57  IST  )

టాలీవుడ్లో ప్రభాస్, మహేష్ బాబు అంటే ఇష్టం అని సీనియర్ నటి రంభ చెప్పుకొచ్చింది.

Rambha: ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్స్‌లో ఆ ఇద్దరంటే చాలా ఇష్టం
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రంభ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ, పలు టెలివిజన్ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ ప్రస్తుతం తనకు అత్యంత ఇష్టమైన ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరూ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారి నటనను నేను ఎంతో అభిమానిస్తాను. వీరిద్దరిలో ఎవరితో సినిమా చేసే అవకాశం వచ్చినా చాలా సంతోషిస్తాను. ఇద్దరితో కలిసి నటించే అవకాశం వస్తే ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పింది. రంభ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ తరం స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' చిత్రంలోని ఐటమ్ సాంగ్లో రంభ కనిపించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

నన్ను బ్రతికిస్తున్న అభిమానుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను: శ్రీలీల

Next Story