విద్యార్థులపై తీసుకొచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలి

by Taduka Kalyani |

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై తీసుకొచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

విద్యార్థులపై తీసుకొచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలి
X

దిశ, హిమాయత్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై తీసుకొచ్చిన రెవెన్యూ రికవరీ యాక్ట్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్కాలర్ షిప్స్ , ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు 8 వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ అధ్యక్షతన హైదరాబాద్ కలెక్టరేట్ ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో విద్యార్థి సంఘ నాయకులు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ పథకం వల్ల అణగారిన వర్గాలు ఉన్నత చదువులు చదువుతున్నాయని , పథకంపై ఎలాంటి ఆంక్షలు లేకుండా యధావిధిగా కొనసాగించాలని కోరారు. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించే చర్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆగస్టు 15 న లోపు ఫీజు బకాయిలు చెల్లించని పక్షంలో మిలిటెంట్ ఉద్యమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన ప్రదర్శనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు నీలా వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story