- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 31 లోపు రేషన్ కార్డు దారులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలి
రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనర్, పౌర సరఫరాల శాఖ, తెలంగాణ వారి ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నిరంతరాయంగా ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించేందుకు రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ ప్రక్రియను ఈ నెల 31 లోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. సిద్ధిపేట జిల్లాలో మొత్తం 10,47,075 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 8,48,446 మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. దీంతో జిల్లాలో 81.03 శాతం ఈ-కేవైసీ పూర్తి అయిందన్నారు. కొన్ని రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసి, మిగిలిన సభ్యులు ఈ-కేవైసీ చేయించుకోనట్లు గుర్తించడం జరిగిందన్నారు. అటువంటి ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయి యంత్రాంగానికి అందజేయడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు, చౌక ధరల దుకాణ డీలర్లు క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా కుటుంబాలను సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేయించేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులందరూ తమ సమీప చౌక ధరల దుకాణాన్ని సంప్రదించి వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






