మోకాలి నొప్పితో బాధపడుతున్న కౌన్సిలర్ స్వరూపను పరామర్శించిన తుంబూరు దయాకర్ రెడ్డి

by Ratna Kumari |

మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూపను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పరామర్శించారు.

మోకాలి నొప్పితో బాధపడుతున్న కౌన్సిలర్ స్వరూపను పరామర్శించిన తుంబూరు దయాకర్ రెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్ : గత పది రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఏదులాపురం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు స్వరూపను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా స్వరూప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న దయాకర్ రెడ్డి, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చిన దయాకర్ రెడ్డి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకుడు ఏనుగు మహేశ్, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Next Story