- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధానోపాధ్యాయుడు శంకర్ సస్పెన్షన్..
గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌ను తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రమేష్ కుమార్ తెలిపారు.

దిశ, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ విధులకు గైర్హాజరైన విషయం తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌ను తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రమేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా పాఠశాలల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు కల్వకుర్తి మండల విద్యాధికారి ఎంఈవో శంకర్ నాయక్‌కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ వివరణ కోరినట్లు డీఈవో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం, విధులకు క్రమం తప్పకుండా హాజరుకావడం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసినట్లు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, పాఠశాలల్లో తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగనున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రమేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.






