- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈశ్వరమ్మ యాదవ్‌ను దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి..
యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌ను కులం పేరుతో దూషించిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని హుజూరాబాద్ బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

దిశ, హుజూరాబాద్ రూరల్: యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌ను కులం పేరుతో దూషించిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని హుజూరాబాద్ బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా, బడుగు బలహీన వర్గాలపై అగ్రకులాల అరాచకాలు, వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతుండటం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి సభ్యురాలిగా నియామకమైన ఈశ్వరమ్మ యాదవ్ సన్మాన కార్యక్రమ ఫ్లెక్సీలో తన పేరు వేయలేదనే నెపంతో, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శివచరణ్ రెడ్డి ఆమెను తీవ్ర పదజాలంతో దూషించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి..
"60 శాతానికి పైగా ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పార్టీలకు, పదవులకు అతీతంగా ఐక్యమవ్వాలి. బడుగు బలహీన వర్గాలన్నీ ఏకమై రాజ్యాధికారాన్ని దక్కించుకున్నప్పుడే అగ్రకులాల అణచివేతను ఎదిరించే శక్తి లభిస్తుంది." అని చందుపట్ల జనార్దన్ తెలిపారు. ఇలాంటి కులహంకార ధోరణులను బీసీ సమాజం సహించబోదని, నిందితుడు శివచరణ్ రెడ్డిపై ప్రభుత్వం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు వన్నాల శివాజీ, బీసీ జేఏసీ కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, నాయకులు ఇప్పకాయల సాగర్, మావునూరి ప్రవీణ్ కుమార్, బీసీ మహిళా నాయకురాలు దేవసాని ప్రియదర్శిని, కొలిపాక క్రాంతి, స్వేరో నాయకుడు అకినపల్లి ప్రవీణ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు రామ్ సారయ్య, గడప రాజు, మేకల రవి, దొంత హరికిషన్, సొల్లు శంకర్, ఊదారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.






