రెబ్బెనలో దారుణ హత్య.. రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం కలకలం

by Taduka Kalyani |

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

రెబ్బెనలో దారుణ హత్య.. రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం కలకలం
X

దిశ, రెబ్బెన: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం మేరకు మృతుడు మాసాడే సోమయ్యగా గుర్తించారు. మృతదేహం తల, మొండెం వేరుగా ఉన్న స్థితిలో కనిపించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు పరిశీలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు, ఘటన ఎలా జరిగిందనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Next Story