బీసీ రిజర్వేషన్ల కోసం రైల్‌ రోకో కేసు.. రైల్వే కోర్టుకు కవిత హాజరు

by Jakkula.Mamatha |

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిర్వహించిన రైల్‌రోకో ఆందోళనకు సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

బీసీ రిజర్వేషన్ల కోసం రైల్‌ రోకో కేసు.. రైల్వే కోర్టుకు కవిత హాజరు
X

దిశ, సికింద్రాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో నిర్వహించిన రైల్‌రోకో ఆందోళనకు సంబంధించిన కేసులో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. సికింద్రాబాద్ బోయిగూడలోని రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఫర్ రైల్వేస్ కోర్టులో విచారణకు హాజరైన కవితతో పాటు తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు నాయకులు కూడా కోర్టుకు వచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసులో ఇది రెండోసారి విచారణకు హాజరుకావడం జరిగినట్లు తెలిపారు.

Next Story