- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగం ఆశ చూపించి మోసం.. రూ.55 వేలు కోల్పోయి యువకుడు బలవన్మరణం
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.55 వేలు వసూలు చేసి ఒక మహిళ యువకుడి చావుకు కారణమైన ఘటన నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, మర్రిగూడ: ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడి నుంచి రూ.55 వేలు వసూలు చేసి ఒక మహిళ యువకుడి చావుకు కారణమైన ఘటన నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి అన్న వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల వెంకటయ్య భారతమ్మలకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు చాపల శివ(25) ఇబ్రహీంపట్నంలో డిగ్రీ చదువుతున్నాడు. అక్కడ ఒక మహిళ పరిచయమై తాను పనిచేసే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మకం కలిగించింది.
ఈ క్రమంలో విడతల వారీగా రూ.55 వేల వరకు వసూలు చేసింది. అయితే చాలా రోజులైనా ఉద్యోగం కల్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నట్లు మృతుడు ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి జిల్లా కేంద్రంకు వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో శివ మృతి చెందాడు. శివ అన్న వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్రిగూడ ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన తమ్ముడి మరణానికి కారణమైన మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు.






