- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. చేర్యాల మున్సిపాలిటీలో బెల్టు షాపు బంద్
చేర్యాల మున్సిపాలిటీలో బెల్టు షాపులను మూత పడేలా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు.

దిశ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీలో బెల్టు షాపులను మూత పడేలా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించడం వల్ల యువకులు, రోజువారీ కూలీలు మద్యానికి బానిసలు అవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విషయాన్ని గత వారంలో ‘దిశ’ పత్రికలో బెల్టు షాపుల బరితెగింపు అనే వార్త కథనంతో ప్రజా ప్రతినిధులు స్పందిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కౌన్సిలర్ కమలాపురం గీతాంజలి ఆధ్వర్యంలో బెల్టు షాపులు మూసివేయాలని వార్డు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం సంతకాలు సేకరించి వాటి ప్రతులను చేర్యాల పోలీసులకు, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ పోలీసులకు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గీతాంజలి మాట్లాడుతూ.. బెల్ట్ షాపుల వల్ల అనేక మంది మద్యానికి బానిసలు అవుతూ ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి వార్డు ప్రజలు, అధికారులు సహకరించాలని కోరారు.






