విజయ్ దేవరకొండ మూవీకి బ్రేక్.. రూ.6 కోట్లు ఖర్చయ్యాక షాకింగ్ నిర్ణయం

by Pulgam srinivas |

విజయ్, మైత్రి కాంబోలో రావలసిన 'హీరో' సినిమా తొలి షెడ్యూల్‌ తర్వాత ఆగిపోయింది.

విజయ్ దేవరకొండ మూవీకి బ్రేక్.. రూ.6 కోట్లు ఖర్చయ్యాక షాకింగ్ నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో ఎంతో నమ్మకంతో సినిమాను ప్రారంభించినప్పటికీ, చిత్రీకరణలో కొంత భాగం పూర్తయ్యాక అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రాజెక్టులను నిలిపివేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటనే విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా విడుదలైంది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనంతరం ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో 'హీరో' అనే టైటిల్‌తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాను ప్రారంభించారు. ఇందులో విజయ్ ప్రొఫెషనల్ బైక్ రేసర్ పాత్రలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, శాలిని పాండే హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, తొలి షెడ్యూల్‌ను సుమారు రూ.6 కోట్ల వ్యయంతో చిత్రీకరించారు. అయితే మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్‌ను చూసిన తర్వాత విజయ్ దేవరకొండ పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని భావించినప్పటికీ, ఆ విషయంలో దర్శకుడు హీరో, నిర్మాతలను పూర్తిగా ఒప్పించలేకపోయాడని సమాచారం. తర్వాత ఈ సినిమా మళ్లీ ప్రారంభం కానుందని వార్తలు వచ్చినా, విజయ్ వరుస సినిమాలతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పడిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ – మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన 'హీరో' సినిమా తొలి షెడ్యూల్ పూర్తైన తర్వాతే నిలిచిపోయింది. ప్రస్తుతం మాత్రం విజయ్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో 'రణబాలి' చిత్రం తెరకెక్కుతుండగా, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story