- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్ల పట్టణంలో అక్రమ ఇంటి నిర్మాణ పనులు.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ ఇంటి నిర్మాణం అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్టణానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ ఇంటి నిర్మాణం అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పట్టణానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుడు కే.చంద్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కోరుట్ల-మెట్‌పల్లి జాతీయ రహదారి సిరి వైన్స్ సమీపంలో అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, ఈ నెల 2వ తేదీన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా కమిషనర్ స్పందించి ఇంటి నిర్మాణ పనులు రెండు రోజుల వరకు నిలిపివేశారని తెలిపారు. తదనంతరం మళ్ళీ యధావిధిగా అక్రమ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని, తెలుసుకొని టౌన్ ప్లానింగ్ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటి నిర్మాణ పనులు ఆపబోమని స్పష్టం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.






