- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేడ్ 2 బీసీ హాస్టల్ వార్డెన్లకు గుడ్ న్యూస్.. సర్వీసు రూల్స్ సడలింపు
గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్ల సమస్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వారికి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ..

దిశ, వెబ్ డెస్క్: గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్ల(Grade-2 Hostel Wardens) సమస్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. వారికి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వీలుగా సర్వీసు నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త ద్వారా సుమారు 300 మందికి పైగా వార్డెన్లకు త్వరలోనే ప్రమోషన్లు లభించనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత వేగం పుంజుకోనుంది.
నిరంతరాయ పోరాటం
గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు సర్వీసు రూల్స్ సడలింపు కోసం 2008 నుంచి నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. పలుమార్లు విన్నవించుకున్నా గత ప్రభుత్వాలు పరిష్కారం చూపలేదు. దీంతో ఈ సమస్యపై మంత్రి సవిత(Minister Savitha) ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించారు. సర్వీసు రూల్స్ సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రి సవితకు గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుందని తెలిపారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం సరైన న్యాయం చేసిందని హర్షం వ్యక్తం చేశారు.






