- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి నటరాజన్‍తో మంత్రుల సమావేశం.. తాజా పరిస్థితులపైకీలక చర్చ
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నేతలు, మంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో సంస్థాగత మార్పులు, జిల్లాల వారీగా రాజకీయ సమీకరణాలపై అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాష్ట్ర నేతలతో వరుస భేటీలు హాట్ టాపిక్‍గా మారాయి. తాజాగా శుక్రవారం ఉదయం నుంచే పలువురు మంత్రులు మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణరావు తదితరులు ఇన్‌ఛార్జ్ మీనాక్షితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరుపై వారితో చర్చించినట్లు సమాచారం.
పార్టీపై ఫోకస్:
గత కొంత కాలంగా అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా డీసీసీలతో నిర్వహించిన సమావేశంలో మంత్రులపై జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, సమన్వయం తదితర అంశాలతో పాటు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఎస్ఐఆర్ (SIR) అమలు తీరుపై కీలక నేతలతో మీనాక్షి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టి కీలక భేటీల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 మంది సీనియర్ నేతలకు మీనాక్షి నటరాజన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.






