- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిడ్జిల్ KGBVలో తీవ్ర కలకలం.. బడిలో ఉండాల్సిన విద్యార్థిని అడవిలో ఏడుస్తూ ప్రత్యక్షం!
దాదాపు 10 కి.మీ దూరం నిర్జనమైన అటవీ ప్రాంతంలోని రోడ్డుపై బాలిక నడుచుకుంటూ వెళ్లిన విద్యార్థిని ఏడుస్తూ గుట్టల్లో ప్రత్యక్షం అయిన ఘటనా ఊర్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది

దిశ, జడ్చర్ల: దాదాపు 10 కి.మీ దూరం నిర్జనమైన అటవీ ప్రాంతంలోని రోడ్డుపై బాలిక నడుచుకుంటూ వెళ్లిన విద్యార్థిని ఏడుస్తూ గుట్టల్లో ప్రత్యక్షం అయిన ఘటనా ఊర్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక చెప్పిన పలు విషయాలు సంచలనంగా మారాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. జడ్చర్లలో నివాసం ఉంటున్న మహిళ గత ఏడాది బాలికను మిడ్జిల్ మండల కేంద్రంలోని కేజీబీవీలో చేర్పించింది. ప్రస్తుతం ఆ బాలిక 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 6న బాలిక ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులు ఇంటికి వచ్చి ఉన్నారు. తిరిగి గురువారం తల్లితో కలిసి విద్యాలయానికి వచ్చింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలికను తల్లి పాఠశాలలో వదిలి వెళ్ళింది. ఆమె వెళ్లిన 10 నిమిషాలకే పెట్టె తాళం చెవి మర్చిపోయానని అమ్మ దగ్గర ఉంది తెచ్చుకుంటానని ఉపాధ్యాయురాలిని కోరింది. ఆమె సరేనని చెప్పడంతో బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు.
రోడ్డుపై ఏడుస్తూ..
సాయంత్రం 6 గంటల సమయంలో ఊర్కొండ-ఊర్కొండపేట మధ్యలోని అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఏడుస్తూ బాలిక కనిపించింది. అటువైపుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలిక తల్లికి, కేజీబీవీ ఉపాధ్యాయురాలికి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలో వైద్యం అనంతరం బాలికను నాగర్‌కర్నూల్ భరోసా కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలిక ఊర్కొండ సమీపంలోని గుట్టల ప్రాంతంలో రోడ్డుపై ప్రత్యక్షమవడం అనుమానాలకు తావిస్తోంది. మిడ్డిల్ నుంచి నడుచుకుంటూ ఊర్కొండపేట వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారని తెలిసింది.
పోలీసులు బాలికను వివరాలు కోరగా.. "చదువుపై ఇష్టం లేక పాఠశాల నుంచి బయటకు వచ్చానని" చెప్పింది. తప్పిపోయిన బాలికను స్థానికుల సాయంతో గుర్తించామన్నారు. కౌన్సిలింగ్ ఇస్తున్నామని, బాలిక చేసిన ఆరోపణల పై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని వివరించారు. తన తల్లి వద్ద తాళంచెవి మర్చిపోయానని తీసుకొస్తానని వెళ్లిన బాలిక మళ్ళీ పాఠశాలకు తిరిగి రాలేదు ఈ విషయం పై పాఠశాల ఇన్చార్జి ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులు మళ్ళీ దృష్టి పెట్టకపోవడం బాలిక పాఠశాలకు వచ్చిందా రాలేదో చూడకపోవడం పాఠశాలకు ఉపాధ్యాయులు ఎస్ఓల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది.
విద్యార్థుల బాగోగులు చూడాల్సిన ఉపాధ్యాయులు అసలు వారిని పట్టించుకోవడమే మానేశారని పాఠశాలలో ఏ విద్యార్థిని లోపల ఉంది ఏ విద్యార్థిని బయటికి వెళ్ళింది అనే అంశాలపై దృష్టి పెట్టకపోవడంతో తరచుగా గురుకుల పాఠశాలలో నుంచి విద్యార్థినిలు పారిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నేడు ఉరుకొండ గుట్టలో విద్యార్థిని ప్రత్యక్షం అవడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుపేదలు చదివే గురుకుల పాఠశాల నిర్వహణ మెరుగుపడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.






