- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సినిమా ఇక లేనట్లే.. ఏమాత్రం కాంప్రమైస్ కాని అక్కినేని హీరోలు
నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లతో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించాల్సిన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగార్జున కెరీర్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో 'సోగ్గాడే చిన్నినాయన' ఒకటి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అనంతరం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కింది. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికీ కళ్యాణ్ కృష్ణనే దర్శకత్వం వహించారు. 'సోగ్గాడే చిన్నినాయన' స్థాయి విజయాన్ని అందుకోకపోయినా, 'బంగార్రాజు' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
కొంతకాలం క్రితం 'సోగ్గాడే చిన్నినాయన' ఫ్రాంచైజీలో భాగంగా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురు హీరోలతో కళ్యాణ్ కృష్ణ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, దానిని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే ఆ చిత్ర కథను అక్కినేని హీరోలకు వినిపించగా, అది వారికి పూర్తిగా నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నాగార్జున 'కింగ్ 100' చిత్రంలో హీరోగా నటిస్తుండగా, నాగచైతన్య 'వృషకర్మ' సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు అఖిల్ తాజాగా 'లెనిన్' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.






