- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తాం.. హైడ్రోజన్ రైలు ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ
దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్ స్టేషన్‌లో పీఎం మోడీ ప్రారంభించారు

దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్ అంతా హైడ్రోజన్‍దే అని రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు (Hydrogen Train)ను శుక్రవారం హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో నరేంద్రమోదీ (PM Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన పీఎం.. పర్యావరణహిత ప్రాధాన్యంలో భాగంగానే హైడ్రోజన్ రైలు తీసుకువచ్చామన్నారు. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాల తర్వాత భారత్‍లోనే హైడ్రోజన్ రైలు ఉందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోజన్ రైలు ఇదని, ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లలో 2-4 కోచ్‍లు మాత్రమే ఉంటాయని కానీ సింద్-సోనిపట్ రైల్లో 10 కోచ్ లు ఉన్నాయన్నారు.
రైల్వే ట్రాక్‍పై సరికొత్త విప్లవం:
పర్యావరణహిత ప్రాధాన్యంలో భాగంగానే హైడ్రోజన్ రైలు తీసుకువచ్చామని రైల్వే రూపురేఖలు మార్చడంలో ఇది కీలకమైన అడుగు అన్నారు. హైడ్రోజన్ రైలుతో హర్యాణా పేరు చిరస్థాయిలో నిలుస్తుందన్నారు. రూ. 14 వేల కోట్లతో రైల్వే, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. దేశ ప్రజలంతా స్వచ్ఛతా మంత్రం పఠిద్దామని పిలుపునిచ్చారు. భవిష్యత్ లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు వస్తాయని హైడ్రోజన్ రైలు.. రైల్వే ట్రాక్ పై సరికొత్త విప్లవానికి నాంది అన్నా్రు. 2014 కంటే ముందు యుద్ధం వస్తే ఇంధన కొరతతో రైళ్లు ఆగిపోయేవి. ఏ సంక్షోభానికైనా భారత్ దగ్గర సమాధానం ఉంటుందన్నారు. 2014 వరకు రైల్వేలో విద్యుదీకరణ 30 శాతం మాత్రమే ఉందని మేం వచ్చాక 12 ఏళ్లలో రైల్వేలో విద్యుదీకరణ 99 శాతానికి పెంచామన్నారు. హార్మూజ్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని హూర్మూజ్ జలసంధి యుద్ధ క్షేత్రంగా మారిందన్నారు. ఇంధన రాకపోకలకు ఇబ్బందిగా మారింది. డీజిల్ రాకుంటే రైళ్లు ఎలా నడుస్తాయి? ఎలాంటి సంక్షోభాలు వచ్చినా భారత్ అడుగులు అభివృద్ధి వైపే అని మోడీ దృష్టి ఎప్పుడూ సమస్యల పరిష్కారం వైపే అని చెప్పారు. భారత్ లో ఒలింపిక్స్ జరిగే సమయం ఎంతో దూరం లేదని ఒలింపిక్స్ పోటీలకు తగినట్లు మన క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు.






