చిన్న వయస్సులోనే అంతర్జాతీయ గుర్తింపు.. విద్యార్థికి ఘన సన్మానం

by Jakkula.Mamatha |

పాల్వంచ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థి అబ్బుల్ నుమాన్ రెండోసారి అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్‌కు ఎంపిక కావడంతో పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

చిన్న వయస్సులోనే అంతర్జాతీయ గుర్తింపు.. విద్యార్థికి ఘన సన్మానం
X

దిశ, పాల్వంచ: పాల్వంచ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థి అబ్బుల్ నుమాన్ రెండోసారి అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్‌కు ఎంపిక కావడంతో పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ కొనే సూరిబాబు పాఠశాల చైర్మన్ కృష్ణ ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు. చిన్న వయసులోనే వరుసగా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, కఠోర సాధన, ఆత్మవిశ్వాసంతో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో నుమాన్ ఉత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని నుమాన్‌ను ఘనంగా అభినందించారు.

Next Story